SRH vs MI ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 25వ మ్యాచ్ ప్రివ్యూ

Srinivas Reddy

Updated on:

SRH vs MI ప్రిడిక్షన్
Fun88 Logo

Get up to ₹20,000 on First Deposit Bonus

Paytm
Phonepe
Google Play
Rupay
Visa
Mastercard

SRH vs MI ప్రిడిక్షన్ 2023 (SRH vs MI Prediction 2023) : IPL సీజన్ 2023 యొక్క ముఖ్యమైన 22వ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మీద ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకూ 4 మ్యాచ్స్ ఆడిన ముంబై ఇండియన్స్ 2 మ్యాచుల్లో గెలిచి టైటిల్ రేసులో ఉన్నామనే సంకేతాన్ని అన్ని జట్లకు సూచించింది. అలాగే, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా మొత్తం 4 మ్యాచ్స్ ఆడితే, అందులో రెండు విజయాలు సాధించింది. ఇరు జట్ల ఆటగాళ్లు కూడా సూపర్ ఫాంలోకి వచ్చారు. అందుకే ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

SRH vs MI ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • సన్ రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్
  • వేదిక: రాజీవ్ గాంధీ స్టేడియం (హైదరాబాద్)
  • తేదీ & సమయం : ఏప్రిల్ 18 & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

SRH vs MI ప్రిడిక్షన్ 2023 : చెలరేగిన SRH బ్యాట్స్‌మెన్లు

కోల్‌కతాతో ఏప్రిల్ 14న జరిగిన మ్యాచులో SRH బ్యాట్స్‌మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా ఎన్నో కోట్లు పెట్టి కొన్న హ్యారీ బ్రూక్ వరుసగా 3 మ్యాచుల్లో 20 స్కోరు కూడా చేయకుండా నిరాశపర్చాడు. ఈ మ్యాచులో మాత్రం ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐపిఎల్ టోర్నమెంటులో మొదటి సెంచరీ నమోదు చేశాడు. అలాగె కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 26 బంతుల్లో 50 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 17 బంతుల్లో 32 రన్స్ చేశాడు. మొత్తంగా కోల్‌కతా మీద సన్ రైజర్స్ ఈ మ్యాచులో ఘన విజయం సాధించింది. అయితే, బౌలింగ్ పరంగా మరింత బాగా వేయాల్సిన అవసరం SRHకు ఉంది. మరి ముంబై మీద ఎలా ఆడుతుందో చూడాలి.

SRH vs MI ప్రిడిక్షన్ 2023 : SRH బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ 117 2392
భువనేశ్వర్ బౌలర్ 150 247 157
వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 55 335 33

SRH vs MI ప్రిడిక్షన్ 2023 : తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్లు: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్
  • మిడిల్ ఆర్డర్: రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), అభిషేక్ శర్మ
  • లోయర్ ఆర్డర్: వాషింగ్టన్ సుందర్, హెన్రిచ్ క్లాసీన్(WK), మయాంక్ మార్కండే
  • బౌలర్లు: భువనేశ్వర్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

SRH vs MI ప్రిడిక్షన్ 2023 : ఫాంలోకి వచ్చిన సూర్య, ఇషాన్ కిషన్

IPL సీజన్ 2023లో 2 మ్యాచుల్లో ఓటమి పాలైన ముంబయి ఇండియన్స్, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఘన విజయం సాధించి టైటిల్ రేసులో నిలిచారు. ముఖ్యంగా ఏప్రిల్ 16న జరిగిన మ్యాచుల్లో బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రోహిత్ శర్మ 13 బంతుల్లో 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్.. ఇద్దరూ సిక్సులు, ఫోర్లతో కోల్‌కతా బౌలర్లను చీల్చి చెండాడారు. ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 58 పరుగులు చేయగా, సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఈ మ్యాచుతో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఆరంగేట్రం చేయగా, 2 ఓవర్స్ వేసిన అర్జున్ 17 పరుగులు ఇచ్చాడు. మొత్తంగా చూస్తే, కోల్‌కతా ఇచ్చిన 184 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఇంకా 14 బంతులు ఉండగానే చేధించడం విశేషం. మరి హైదరాబాద్ మీద ఇదే ఫాం కొనసాగిస్తారా లేదా చూడాలి.

SRH vs MI ప్రిడిక్షన్ 2023 : ముంబై బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రోహిత్ శర్మ బ్యాటింగ్ 231 5986 15
పీయూష్ చావ్లా బౌలర్ 162 589 162
జోఫ్రా ఆర్చర్ ఆల్ రౌండర్ 36 195 46

SRH vs MI 2023 : తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
  • మిడిల్ ఆర్డర్: సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రూయిస్
  • లోయర్ ఆర్డర్: కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా
  • బౌలర్లు: పీయూష్ చావ్లా, డ్యుయన్ జాన్సన్, హృతిక్ షోకిన్

SRH vs MI ప్రిడిక్షన్ 2023 : 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడండి.

ఆడిన మ్యాచ్‌లు ముంబై గెలిచింది SRH గెలిచింది టై
19 10 09 00

ప్రస్తుతం చూస్తే, ఇరు జట్లు గత మ్యాచుల్లో ఘన విజయం సాధించి ఎంతో నమ్మకంగా ఉన్నాయి. ఇక్కడ మరొకటి ఏమిటంటే, రెండు జట్లూ కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మీదే విజయం సాధించడం విశేషం. గత రికార్డులు చూస్తే కూడా దాదాపు రెండింటి విజయాలు సమానంగా ఉన్నాయి. మొత్తం 19 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్స్ గెలవగా, SRH 9 మ్యాచ్స్ గెలిచింది. కావున, ఈ మ్యాచ్ గెలుపు అనేది చాలా ఉత్కంఠగా ఉంటుంది. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ కావాలనుకుంటే Fun88 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర ఆటల మీద బెట్టింగ్ కోసం Fun88 ఉత్తమమైనది.

Star it if you find it helpful.

0 / 5

Your page rank:

About the author

Srinivas Reddy