RR vs LSG ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 26వ మ్యాచ్ ప్రివ్యూ

Srinivas Reddy

Updated on:

RR vs LSG ప్రిడిక్షన్
Fun88 Logo

Get up to ₹20,000 on First Deposit Bonus

Paytm
Phonepe
Google Play
Rupay
Visa
Mastercard

RR vs LSG ప్రిడిక్షన్ 2023 (RR vs LSG Prediction 2023) : IPL సీజన్ 2023లో రెండు అత్యుత్తమ జట్లు అయిన రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. రెండు టీమ్స్ కూడా చెన్నై వంటి ఉత్తమ జట్టు మీద విజయం సాధించడమే కాకుండా, పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. టైటిల్ రేసులో తప్పకుండా ఈ రెండు టీమ్స్ ఉంటాయని అంచనాలు ఉన్నాయి. ఇలాంటి రెండు బలమైన బ్యాటింగ్, బౌలింగ్ కల్గిన రెండు జట్ల మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఉంటుంది. అలాగే, రెండు జట్లలో ఎవరు గెలుస్తారో ఊహించడం చాలా కష్టం అవుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్టు సారథి సంజూ శాంసన్… ఇద్దరూ కూడా ఉత్తమ బ్యాటింగ్ మరియు కెప్టెన్సీతో ఐపిఎల్‌లో దుమ్ము రేపుతున్నారు. ఈ రెండు జట్లలో ఎవరు విజయం సాధిస్తారో ఇప్పుడు అంచనా వేద్దాం.

RR vs LSG ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • రాజస్థాన్ రాయల్స్ Vs లక్నో సూపర్ జెయింట్స్
  • వేదిక: సవాయ్ మాన్ సింగ్ స్టేడియం (జైపూర్)
  • తేదీ & సమయం : ఏప్రిల్ 19 & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

RR vs LSG ప్రిడిక్షన్ 2023 : గత మ్యాచ్‌లో GT పైన గెలిచిన RR

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ చివరి వరకూ బాగా ఆడారు. ఓపెనర్లు అయిన జోస్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్ నిరాశ పర్చినా.. సంజూ శాంసన్, హెట్మెయిర్ బాగా ఆడి జట్టుకు విజయం సాధించారు. సంజూ శాంసన్ 32 బంతుల్లో 60 పరుగులు చేయగా, షిమ్రాన్ హెట్మెయిర్ 26 బంతుల్లో 56 పరుగులతో రెచ్చిపోయాడు. అలాగే, బౌలర్లలో సందీప్ శర్మ నాలుగు ఓవర్స్ వేసి కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే, రెండు కీలక వికెట్స్ కూడా తీసుకున్నాడు. మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్‌ను అందరూ ఓడిపోతుందని భావించారు. అయితే, ఉత్తమ బ్యాటింగ్ చేసి జట్టును శాంసన్ మరియు హెట్మెయిర్ గెలిపించారు.

RR vs LSG ప్రిడిక్షన్ 2023 : RR బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
సంజూ శాంసన్ బ్యాటింగ్ 142 3683
యజ్వేంద్ర చాహల్ బౌలర్ 136 37 177
ఆర్. అశ్విన్ ఆల్ రౌండర్ 189 688 163

RR vs LSG ప్రిడిక్షన్ 2023 : RR తుది 11 ఆటగాళ్లు

  • ఓపెనర్ బ్యాటర్: జోస్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్
  • మిడిల్ ఆర్డర్: సంజు శాంసన్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్) మరియు దేవదత్ పడిక్కల్
  • లోయర్ ఆర్డర్: షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ మరియు జాసన్ హోల్డర్
  • బౌలర్లు: రవి అశ్విన్, చాహల్, సందీప్ శర్మ మరియు ట్రెంట్ బౌల్ట్

RR vs LSG ప్రిడిక్షన్ 2023 : గత మ్యాచ్‌లో ఓడిపోయిన లక్నో

ఈ టోర్నీలో ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్స్ బాగా ఆడింది. అయితే, ఏప్రిల్ 15న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ఓటమి పాలవడం అభిమానుల్ని కలిచి వేసింది. అంతకు ముందు జరిగిన మ్యాచులో RCB మీద అద్భుత విజయం సాధించిన లక్నో, పంజాబ్ మీద ఓడిపోయింది. మొత్తం 5 మ్యాచుల్లో 3 మ్యాచ్స్ గెలిచిన లక్నో, రెండు మ్యాచుల్లో ఓడిపోయినా కూడా పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. ఎందుకంటే లక్నో నెట్ రన్ రేట్ +0.761 ఉంది. ఏప్రిల్ 19న రాజస్థాన్ రాయల్స్ మీద గెలిచి తిరిగి పుంజుకోవాలని లక్నో భావిస్తుంది.

RR vs LSG 2023 : లక్నో బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
కె.ఎల్.రాహుల్ బ్యాటింగ్ 114 4044  
రవి బిష్ణోయ్ బౌలర్ 42 14 45
మార్కస్ స్టోయినిస్ ఆల్ రౌండర్ 72 1193 34

RR vs LSG 2023 : LSG తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్లు: కైల్ మేయర్స్ మరియు కేఎల్ రాహుల్ (కెప్టెన్)
  • మిడిల్ ఆర్డర్: దీపక్ హుడా, నికోలస్ పూరన్ మరియు మార్కస్ స్టోయినిస్
  • లోయర్ ఆర్డర్: ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా
  • బౌలర్లు: రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, యుధ్ వీర్ సింగ్

RR vs LSG ప్రిడిక్షన్ 2023 : 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడవచ్చు.

ఆడిన మ్యాచ్‌లు రాజస్థాన్ గెలిచింది లక్నో గెలిచింది టై
02 02 0 0

రెండు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ స్థానాల్లో ఉన్నారు. రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, లక్నో రెండవ స్థానంలో ఉంది. రికార్డులను పరిశీలిస్తే ఇద్దరూ 2 మ్యాచ్‌లు ఆడగా, అందులో రాజస్థాన్ 2 మ్యాచ్స్ గెలవగా, లక్నో ఇంత వరకూ రాజస్థాన్ మీద గెలుపు సాధించలేదు. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ కావాలనుకుంటే Fun88 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర ఆటల మీద బెట్టింగ్ కోసం Fun88 ఉత్తమమైనది.

Star it if you find it helpful.

0 / 5

Your page rank:

About the author

Srinivas Reddy